Singer Sunitha: స్వామి వారు నా మెడలో గొలుసు వేశారు.. విదేశీ భక్తులు నా దగ్గరకు వచ్చి నా కాళ్లకు..: సింగర్ సునీత

Singer Sunitha: స్వరాలన్నీ తన గొంతులో నాట్యమాడుతాయి.. చక్కని చిరునవ్వుని ఆభరణంగా మలచుకున్న సింగర్ సునీత పెళ్లి తరువాత వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. తన జీవితంలో జరిగిన సంఘటనలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
ఆధ్యాత్మిక చింతనను తన జీవితంలో భాగం చేసుకున్న సునీత.. గతంలో ఓ సారి పుట్టపర్తి సాయిబాబాని దర్శించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇండస్ట్రీకి చెందిన మధుకర్ గారి సాయంతో పుట్టపర్తి సాయిబాబాని దర్శించుకునే భాగ్యం కలిగిందని అన్నారు. అప్పటి వరకు ఓ మనిషిని దేవుడిగా చిత్రీకరించడం ఏమిటని అపోహలో ఉన్నాను. కానీ ఆయన్ని దర్శించుకున్న తరువాత నా ఆలోచన నిజం కాదని తెలుసుకున్నాను.
స్వామి వారి ఆశ్రమంలో ఆ రోజు చాలా పాటలు పాడాను.. స్వామి వారు నన్ను మెచ్చుకుని నన్ను పిలిచి నాతో చాలా సేపు మాట్లాడారు. ఆయనతో మాట్లాడినదంతా నా పర్సనల్ లైఫ్ గురించే. అప్పుడు ఆయన నన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. నా మెడలో గొలుసు వేశారు. ఆయన ఆశీర్వాదం అందరికీ దొరకదని అది నాకు ప్రత్యేకమైనదని బయటకు వచ్చిన తరువాత తెలిసింది.
ఎందుకంటే నా చుట్టూ స్వామి వారి భక్తులు చేరిపోయారు.. ఏడుస్తూ మీరు ఎంత అదృష్టవంతులో అని అనడం, ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా అని అనడం, నా కాళ్లకు దండం పెట్టడం వంటివి చేశారు.
అయితే ఇదంతా నా గొప్పతనం అని నేను అనుకోలేదు.. నాలో ఏదో ప్రత్యేకత ఉన్నదని మాత్రం అనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయానికి సాక్ష్యం ఉంది. నాతో పాటు వచ్చిన మ్యుజీషియన్స్ స్వామి వారు నాతో చెప్పిన విషయాలు విన్నారు. ఆ దేవుడు నా జీవితంలో చాలా చేశాడు అని చెప్పుకొచ్చారు సింగర్ సునీత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com