Sunitha : ఆ సమయంలో ఆయనే నాకు సపోర్ట్‌గా నిలిచారు : సింగర్ సునీత

Sunitha : ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత్ తాజగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సింగర్‌గా తన కెరీర్‌లో 'ఈ వేళలో' పాట నుంచి మంచి అవకాశాలు వచ్చాయని చెప్పారు. శ్రీకాంత్ 'పెళ్లి పందిరి' సినిమాకు మొదటి సారి డబ్బింగ్ చెప్పానననారు. ఆ తరువాత అనేక మంది ప్రముఖ హీరోయిన్లకు వాయిస్ ఇచ్చానన్నారు. సోనాలి బింద్రే, సౌందర్య, రాశి, నయనతార, కళ్యాని, లయ, కొత్తగా పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్యకు కూడా వాయిస్ ఇచ్చినట్లు చెప్పారు.
గతంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు సింగర్ ఎస్‌పి బాలసుబ్రహ్మన్యం తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారన్నారు. ఆయన మరణం దురదృష్టకరమని.. ప్రతీరోజూ ఆయన మాటల్ని గుర్తు తెచ్చుకుంటానని అన్నారు. ఇక రామ్‌తో పెళ్లి గురంచి మాట్లాడుతూ.. వచ్చిన విమర్శలను తాను అంతగా పట్టించుకోనన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. పిల్లలు కుటుంబసభ్యులు చెప్పడంతో తాను రామ్‌ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రామ్‌తో వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com