అందుకే హీరోయిన్ గా చేయలేదు : సింగర్ సునీత

అందుకే హీరోయిన్ గా చేయలేదు : సింగర్ సునీత
తెలుగు చిత్రపరిశ్రమలో సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సునీత.. ఆమె గాత్రం ఎంత మధురంగా ఉంటుందో.. ఆమె రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది.

తెలుగు చిత్రపరిశ్రమలో సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సునీత.. ఆమె గాత్రం ఎంత మధురంగా ఉంటుందో.. ఆమె రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. అందగత్తె అయిన ఈ సింగర్‌కి హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చాయట. సింగర్ గా ఉన్నప్పుడే హీరోయిన్ గా చేయమని చాలా మంది దర్శకనిర్మాతలు అడిగారట.. కానీ ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించారట సునీత. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సునీత.

సింగర్ గా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఓ సినిమా కోసం సునీతకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారట.. అయితే హీరోయిన్ గా మారితే కష్టాలు ఉంటాయని, వాటిని దగ్గర నుంచి చూశానని అలాంటి జీవితం తనకు వద్దు అంటూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని వద్దని సున్నితంగా తిరస్కరించారట సునీత. అలాగే వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ 'అనగనగా ఒక రోజు' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తే దానిని కూడా తిరస్కరించారట.

అయితే ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా అని అడిగితే దీనికి ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు సునీత. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకని.. ఇప్పుడంతా బాగానే ఉంది క‌దా అని సమాధానం ఇచ్చారు. కాగా సునీత ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే!

Tags

Read MoreRead Less
Next Story