ఎందుకు లేట్.. స్టార్ట్ చేయండి కొత్తగా.. సింగర్ సునీత

ఎందుకు లేట్.. స్టార్ట్ చేయండి కొత్తగా.. సింగర్ సునీత
'కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు.

సుస్వరాల సుమధుర గాయని సునీత తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను సాగర తీరాల్లో ఓలలాడిస్తుంది. స్టార్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న సునీత వివాహ జీవితంలోకి అడుగు పెట్టి కొత్త బంధాన్ని ఏర్పరుచుకుంది.

వివాహం తర్వాత సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అప్పుడప్పుడు పోస్ట్‌లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలతో పాటు పచ్చని పంట పొలాల మధ్య తాను దిగిన కొన్ని ఫోటోలను సునీత పోస్ట్ చేసింది ..

'కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు. అమెరికన్ రచయిత జాన్ ఫోండా కోట్ చేసిన ఈ వాఖ్యాలను జత చేసింది. , "సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు" అని శీర్షికకు ఒక కొటేషన్‌ను కూడా జోడించింది. సునీత తన వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబించేలా ఈ శీర్షికను ఉపయోగించారా అని నెటిజన్ప్ చెవులు కొరుక్కుంటున్నారు.

ఏదేమైనా తను సంతోషంగా ఉంది.. అంతకంటే కావలసింది ఏముంది. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది.. వారు ఎంచుకున్న మార్గం సరైనదైనప్పుడు విమర్శలెందుకు అంటూ సునీత కొత్త జీవితం ఆమెకి మరింత ఆనందాన్నివ్వాలని కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story