Singer Sunitha: 'నిన్ను చూసి గర్వపడుతున్నా'.. కూతురిపై సునీత స్పెషల్ పోస్ట్

Singer Sunitha: నిన్ను చూసి గర్వపడుతున్నా.. కూతురిపై సునీత స్పెషల్ పోస్ట్
Singer Sunitha: సునీత.. తన తరువాత.. తన వారసురాలిగా కూతురు శ్రేయను సింగర్‌గా పరిచయం చేయాలనుకుంటున్నారు.

Singer Sunitha: సినీ పరిశ్రమలో నటీనటులు మాత్రమే కాదు.. సింగర్స్ కూడా పాపులరే. ఒక్కొక్కసారి నటీనటులతో సమానంగా సింగర్స్ పర్సనల్ లైఫ్ కూడా ఫేమస్ అవుతుంది. అలాంటి సింగర్స్‌లో ఒకరు సునీత. తన అందమైన గాత్రంతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న సునీత.. పర్సనల్ లైఫ్‌ను కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు ప్రేక్షకులు. ఇటీవల సునీత కూతురి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సునీత.. సింగర్‌గా ఒక మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఇక తన తరువాత.. తన వారసురాలిగా తన కూతురు శ్రేయను కూడా సింగర్‌గా పరిచయం చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే 'సవ్యసాచి' చిత్రంతో సింగర్‌గా డెబ్యూ చేసేసింది. ప్రస్తుతం సింగర్‌గా నిలదొక్కుకోవడానికి మరింత ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇటీవల శ్రేయ బర్త్‌డే సందర్భంగా సునీత తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.

'ఎప్పుడూ సంతోషంగా ఉండు నాన్న. నువ్వు నీ బర్త్‌డేను సూపర్ డూపర్‌గా జరుపుకోవాలి. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. హ్యాపీ బర్త్ డే' అన్న క్యాప్షన్‌తో తన కూతురి ఫోటోలు షేర్ చేశారు సునీత. అంతే కాకుండా తను తన కూతురితో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ 'బర్త్ డే గర్ల్‌తో' అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story