Sivaji Raja : అతడి రాకతో 'మా' లో రాజకీయాలు.. నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చాడో ?

Sivaji Raja : మరో రెండు రోజుల్లో జరగబోయే మా ఎన్నికల పైన సీనియర్ నటుడు శివాజీరాజా స్పందించాడు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మా లో ఇన్ని గొడవలు రావడానికి కారణం నరేశ్ ఒక్కడే అంటూ ఆరోపణలు చేశారు శివాజీరాజా.. గత ఏడాది నరేష్ కి, నాగబాబు మద్దతు ఇవ్వకపోతే విజయం సాధించేవాడు కాదని.. అసలు అతనికి నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చాడో ఇప్పటికి తెలియదని చెప్పుకొచ్చాడు.
నరేశ్ ఆడే పాచికల ఆటలో ప్రాణమిత్రులు కూడా విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. నరేశ్ నాకు శత్రువు కాదని.. కానీ అతడు నాపై అసత్యప్రచారాలు చేశాడని, అవి అబద్దాలు అని తెలిసినప్పటికీ ఇప్పటివరకూ మాకు క్షమాపణలు చెప్పలేదని అన్నాడు. అతని రాకతోనే మా అసోసియేషన్‌లో రాజకీయాలు మొదలయ్యాయని, తనకి హీరో శ్రీకాంత్‌కి సారీ చెప్పేవరకూ నేను అతడిని తిడుతూనే ఉంటానని శివాజీరాజా వెల్లడించాడు. కాగా ఈసారి జరగబోయే మా ఎన్నికల పైన తానూ స్పందిచబోనని చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com