Slum Dog Husband: స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్ విడుదల

Slum Dog Husband: స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్ విడుదల
సంజయ్ రావ్ హీరో గా స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్‌ను గురువారం హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు.

సంజయ్ రావ్ హీరో గా స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్‌ను గురువారం హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. పిట్ట కథ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్ రావ్ "స్లమ్ డాగ్ హస్బెండ్" అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు మరో సారి రాబోతున్నాడు. సంజయ్‌ నటించిన పిట్ట కథ సినిమా గురించి అప్పట్లో మంచి టాక్‌ వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం కూడా వైవిధ్యమైన కామెడీ ఎంటర్టైనింగ్ కథతో రాబోతోంది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

స్లమ్ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి,అబ్బాయి, పెళ్లి కోసం తాపత్రయం పడే సీన్లతో ట్రైలర్ స్టార్ట్ కాగా, ఆ తరువాత ఈ ట్రైలర్ మొత్తం చాలా డిఫరెంట్ గా కొనసాగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయికి ఒక గండం ఉందడంతో అమ్మాయి ముందు కుక్కని పెళ్లి చేసుకోవడం, ఇక కుక్కని పెళ్లి చేసుకున్నాక ఆ గండం గట్టెక్కింది అనే నమ్మకంతో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కోర్టులో మొదటి భార్య (కుక్క) బతికి ఉండగా రెండో భార్యని ఎలా చేసుకుంటారు అని కేసు పెట్టడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తిగా మారింది. ఈ ట్రైలర్ లో బ్రహ్మాజీ, సప్తగిరి, ఆలీ మంచి కామెడీని పండించారు.

సరైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా, మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సినిమా మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాలోసంజయ్ రావ్, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సునీల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మాత్రం భీమ్స్‌ సిసోరియ అందిచాడు.

Tags

Read MoreRead Less
Next Story