సంపూర్ణేశ్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం సంపూర్ణేశ్ బాబు 'బజార్ రౌడీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు శివారులో జరుగుతుంది. అయితే సినిమా షూటింగ్‌లో భాగంగా సంపూ బైక్‌ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా బైక్‌పై సంపూర్ణేశ్ లేచి కిందకు దిగుతుండగా అదుపు తప్పింది.
తాడుతో బైక్‌ను కిందకు దింపే సమయంలో అదుపు తప్పి ప్రమాదం జరిగింది. దీనితో బైక్ తో పాటుగా సంపూ కూడా కింద పడిపోయాడు. ఆ తర్వాత సంపూ లేవడానికి ప్రయత్నించగా కుదరలేదు. దీనితో వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సంపూను పైకి లేపారు. సంపూర్ణేశ్ బాబుకి తృటిలో ప్రమాదం తప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక బజార్ రౌడీ సినిమా విషయానికి వచ్చేసరికి వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సందిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com