Rahul Ramakrishna: 'తాగి ట్వీట్ చేసిన సందర్భాలు ఉన్నాయా?'.. నటుడిని అడిగిన నెటిజన్..

Rahul Ramakrishna: సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య ఓ ముఖ్యమైన మీడియంగా మారింది. మామూలుగా సెలబ్రిటీలు.. ప్రతీ అభిమాని ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోవచ్చు. కానీ కొందరికైనా అభిమానుల ప్రశ్నలకు సమాధానం దొరికేది సోషల్ మీడియాలోనే. కొన్నిసార్లు నెటిజన్లు అడిగే ప్రశ్నలు కూడా కాస్త వింతంగా ఉంటాయి. తాజాగా ఓ నటుడికి కూడా అలాంటి ఓ వింత ప్రశ్నే ఎదురయ్యింది.
'అర్జున్ రెడ్డి' చిత్రంతో హీరో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ వచ్చిందో.. అందులో తన ఫ్రెండ్‌గా నటించిన రాహుల్ రామకృష్ణకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ప్రతీ సినిమాలో తన తెలంగాణ యాసలో ఆకట్టుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు రాహుల్. ఇక సోషల్ మీడియాలో కూడా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మనసుకు అనిపించింది చెప్పేస్తూ పలు కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటాడు ఈ యాక్టర్.
ఇటీవల ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ. అందులో ఒక నెటిజన్.. 'తాగి ట్వీట్ చేసిన సందర్భాలు ఉన్నాయా గురు?' అని అడగగా.. చాలాసార్లు అంటూ సమాధానం ఇచ్చాడు రాహుల్. ఇలా స్ట్రెయిట్‌గా మొహం మీదే సమాధానాలు చెప్పేయడం రాహుల్‌కు అలవాటే. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించాడు రాహుల్ రామకృష్ణ.
Taagesi tweets esinaa sandarbhaalu unnayaaa,Guru ??
— Tom (@Nenu_jerry) August 5, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com