Sonali Bendre: టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న మరో సీనియర్ నటి.. స్టార్ హీరోతో..

Sonali Bendre: తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అలనాటి నటీమణులకు ఛాన్స్ ఇచ్చి.. టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇప్పించడం డైరెక్టర్స్‌కు బాగా అలవాటు అయిపోయింది. అలా జరగడం వల్ల సినిమాలకు కూడా బాగానే హైప్ లభిస్తుంది. అందుకే ఒకప్పుడు హీరోయిన్లుగా మెప్పించి ఫేడవుట్ అయిపోయిన నటీమణుల లిస్ట్ తయారు చేస్తున్నారు దర్శకులు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సీనియర్ నటి చేరింది.
సోనాలి బింద్రే.. ఈ పేరుకు బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా పెద్దగా పరిచయం అవసరం లేదు. నిజనాకి సోనాలి బింద్రే నటించిన హిందీ సినిమాల సంఖ్యే చాలా ఎక్కువ. వాటితో పోలిస్తే.. తను చాలా తక్కువ తెలుగు సినిమాల్లో నటించింది. కానీ తక్కువ సినిమాలతోనే టాలీవుడ్‌లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సోనాలి బింద్రే. ఇక దాదాపు 18 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది ఈ భామ.
సోనాలి బింద్రే సినిమాలకు దూరంగా ఉన్నా కూడా పర్సనల్ విషయాల గురించి మాత్రం తన ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండేది. ఇక క్యాన్సర్ కారణంగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన సోనాలి బింద్రే మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకొని బుల్లితెరపై డ్యాన్స్ షోకు జడ్జిగా అలరిస్తోంది. తాజాగా ఓ హిందీ సినిమాలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది.
క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత తన కెరీర్‌ను మళ్లీ ఫామ్‌లోకి తీసుకురావాలి అనుకుంటున్న సోనాలి బింద్రే తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో సోనాలి ఓ కీలక పాత్ర పోషించనుందని ఎప్పటినుండో టాక్ వినిపస్తోంది. కానీ ఈమధ్య ఈ టాక్ నిజమే అన్న సమాచారం వైరల్‌గా మారింది. ఇప్పటికీ సోనాలి తెలుగులో యాక్ట్ చేస్తే వెల్‌కమ్ చెప్పే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com