Sonali Bendre: కేవలం డబ్బు కోసమే ఆ సినిమాలు చేశాను: సోనాలి బింద్రే

Sonali Bendre: సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. యాక్టింగ్ నచ్చి సినిమాల్లోకి వచ్చాను అని చెప్పేవారు ఎంతమంది ఉంటారో.. అలాగే అనుకోకుండా వచ్చానని, అవసరం వచ్చానని చెప్పేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. తాజాగా సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే కూడా అలాంటి ఓ షాకింగ్ విషయమే బయటపెట్టింది.
1994లో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనాలి.. చాలా హిందీ సినిమాల్లో నటించిన తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హిందీతో పాటు తాను తెలుగులో కూడా ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. ఎక్స్‌పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ.. తన చీరకట్టుతోనే అభిమానులను సాధించింది సోనాలి బింద్రే. క్యాన్సర్‌లాంటి మహమ్మారితో పోరాడి బయటపడింది.
ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండడంతో సోనాలి బింద్రే మరోసారి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. త్వరలో ఓ హిందీ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొనే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. తను కెరీర్ మొదట్లో కేవలం డబ్బుల కోసమే ఎన్నో తెలుగు, హిందీ సినిమాలకు ఓకే చెప్పానని తెలిపింది. అప్పట్లో తన కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతుండడంతో మేకర్స్ ఇచ్చే భారీ రెమ్యునరేషన్ కోసమే కొన్ని సినిమాలను ఒప్పుకున్నానని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com