ప్రముఖ తెలుగు యాంకర్ కు సోనూసూద్ ప్రశంసలు..!

కోవిడ్ బాధితులకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. కానీ అందరికంటే మిన్నగా ఆపన్నులను ఆదుకునే ఆపద్భాంధవుడిగా అందరికీ సోనూసూద్ కనిపిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఊపిరి తీసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతోంది.
ఇలాంటి సమయంలో ఆయన చేస్తున్న సాయానికి తానూ చేయూత నివ్వాలనుకుంది. సోనూసూద్ ఫౌండేషన్ కి తన దగ్గర ఉన్న ఖరీదైన దుస్తులను వేలం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బుని సోనూసూద్ ఫౌండేషన్ కి విరాళం రూపంలో అందించింది యాంకర్ వింధ్యా విశాఖ.
ఆమె చేసిన సహాయానికి సూనూ ముగ్ధులయ్యారు. ఆయనే స్వయంగా మాట్లాడుతూ వింధ్యకు థాంక్స్ చెబుతూ ఓ వీడియో చేసి పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని వింధ్య తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులతో పంచుకున్నారు.
ఈ వీడియోలో సోనూసూద్ మా్టలాడుతూ.. హాయ్ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సాయానికి చిన్న థాంక్స్ అనే పదం సరిపోదు. మా ఫౌండేషన్ పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు.
మీరు నిజమైన రాక్ స్టార్. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు కురిపిస్తుంది. మీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి అంటూ పేర్కొన్నారు.
సోనూ సూద్ స్వయంగా బదులివ్వడంతో వింధ్య ఎంతో సంతోషించింది. వింధ్య పలు టీవీ షోలతో పాటు, ఐపీఎల్, ప్రొ కబడ్డీ లీగ్ లకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com