సౌందర్య అసలు పేరు.. కోరిక తీరకుండానే ముగిసిన జీవితం..

సౌందర్య అసలు పేరు.. కోరిక తీరకుండానే ముగిసిన జీవితం..
తనకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు అందాలు ఆరబోస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. అవేవీ చేయకుండానే సౌందర్యను వెదుక్కుంటూ వచ్చాయి ఆఫర్లు. పేరుకు తగ్గట్టుగానే ముగ్ధమనోహర రూపం, ఆకట్టుకునే అభినయం, వినయంతో కూడిన సంస్కారం.

మంచి వాళ్లు త్వరగా దేవుడి దగ్గరకు వెళ్లిపోతారు. అమ్మమ్మ చెప్పిన మాటలు అక్షర సత్యాలే. ఎందుకంటే చిత్ర పరిశ్రమ అంటేనే ఎన్నో ఒడిదుడుకులు.. ఎక్స్ పోజింగ్ చేస్తే కానీ రాని అవకాశాలు.. తనకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు అందాలు ఆరబోస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు.

అవేవీ చేయకుండానే సౌందర్యను వెదుక్కుంటూ వచ్చాయి ఆఫర్లు. పేరుకు తగ్గట్టుగానే ముగ్ధమనోహర రూపం, ఆకట్టుకునే అభినయం, వినయంతో కూడిన సంస్కారం. అదే ఆమెని పరిశ్రమలో నిలబెట్టింది. స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించిన సౌందర్య సినీ ప్రేమికులను విడిచి 17 ఏళ్లయింది.

అయినా టీవీలో ఆమె సినిమా వస్తుందంటే ఆసక్తిగా చూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. సినిమాల్లో నటిస్తున్నప్పుడే పెళ్లి చేసుకున్న సౌందర్య రాజకీయాల్లో చేరింది. పార్టీ ప్రచారానికని హెలికాప్టర్‌లో బయలు దేరిన ఆమె కొద్ది దూరం వెళ్లాక అది కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు.

అప్పటికి ఆమె రెండు నెలల గర్భవతి కూడా. సినిమాల్లోకి రాకముందు సౌందర్య పేరు సౌమ్య. అయితే తానే సౌందర్య అని మార్చుకుంది చిత్ర సీమలోకి అడుగుపెట్టే ముందు. బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్‌తో కలిసి సూర్యవంశ్ చిత్రంలో నటించి మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. దర్శకత్వం చేయాలని సౌందర్యకు కోరిక ఉండేది. కానీ అది తీరకుండానే ఆమె జీవితం ముగిసిపోయింది. కానీ ఆమె నిర్మాతగా వ్యవహరించిన 'ద్వీప' చిత్రానికి జాతీయ అవార్డుతో పాటు పలు అవార్డులు దక్కాయి.

తనువు చాలించే నాటికి సౌందర్య వయసు 31 సంవత్సరాలు మాత్రమే. ఓ అద్భుతమైన నటిని చిత్రసీమ కోల్పోయింది. ఈ రోజు ఆమె వర్థంతి.

Tags

Read MoreRead Less
Next Story