బాలసుబ్రహ్మణ్యం పాటల ప్రస్థానం ఎప్పుడు మొదలైందంటే..

బాలసుబ్రహ్మణ్యం పాటల ప్రస్థానం ఎప్పుడు మొదలైందంటే..
దాదాపు 40 వేలకుపైగా స్వరాలు బాలసుబ్రహ్మణ్యం గాత్రం నుంచి జాలువారాయి. 50 ఏళ్లలో 11 భాషల్లో 40 వేలకుపైగా పాటలు..

బాలసుబ్రహ్మణ్యం పాటల ప్రస్థానం 1966లో తెలుగు సినిమాతో మొదలైంది. మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరిన బాలు... చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడేవారు. అదే సమయంలో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మంచి ఫాంలో ఉన్న టైంలోనే హోటల్ రంభ సినిమాతో బ్రేక్ పడింది. తమిళంలో బాలసుబ్రహ్మణ్యంకు MGR అవకాశం ఇచ్చిన 1969 సంవత్సరంలోనే ప్రముఖ గాయని ఎల్‌ఆర్ ఈశ్వరితో కలిసి బాలు హుషారుగా పాటలు పాడారు. ఆ చిత్రం తన కెరీర్‌కు ప్లస్ అవుతుందనుకున్నారు. కానీ ఆ మూవీ అసలు రిలీజే కాలేదు. దీంతో బాలుకు నిరాశ తప్పలేదు. కానీ ఆ తర్వాత తమిళంలో వరుసగా బాలు సాంగ్స్ హిట్ కావడంతో వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు.

దాదాపు 40 వేలకుపైగా స్వరాలు బాలసుబ్రహ్మణ్యం గాత్రం నుంచి జాలువారాయి. 50 ఏళ్లలో 11 భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడడం సాధారణ విషయం కాదు. ఈ అసాధారణ కృషే బాలును గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లోకి చేర్చింది. అంతేకాదు 40కిపైగా చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story