బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఉద్వేగానికి గురైన ఎస్పీ బాలు కుమారుడు..

X
By - Nagesh Swarna |25 Sept 2020 4:40 PM IST
ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. అభిమానులు ఉన్నంతవరకు బాలు పాట చెరిగిపోదని.. కుమారుడు చరణ్ ఉద్వేగానికి గురైయ్యారు.
మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. SP చరణ్ నివాసానికి బాలు పార్ధివదేహాన్ని తరలించారు. శనివారం ఉదయం వరకు ఇంటి వద్దనే బాలు భౌతికకాయం ఉండనుంది. శనివారం మధ్యాహ్నం తర్వాత చెన్నై శివారులోని తమరైపాక్యంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చేసిన అంతిమయాత్ర రథం సిద్ధంగా ఉంచారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com