శ్వాస తీసుకోకుండా సింగిల్ టేక్‌లో పెద్ద పాట పాడిన బాలు..

శ్వాస తీసుకోకుండా సింగిల్ టేక్‌లో పెద్ద పాట పాడిన బాలు..
శ్వాస తీసుకోకుండా సింగిల్ టేక్‌లో పాడిన పెద్ద పాట ప్రేక్షలను మైమరిచేలా చేసింది.

పాటలు పాడడమే కాదు వాటిలో సరికొత్త ప్రయోగాలు చేయడంలో బాల సుబ్రహ్మణ్యంకు సాటిలేరు. అలాంటిదే కేలడి కణ్మని చిత్రం. శ్వాస తీసుకోకుండా సింగిల్ టేక్‌లో పాడిన పెద్ద పాట ప్రేక్షలను మైమరిచేలా చేసింది. ఈ చిత్రంలో రాధిక సరసన హీరోగా బాల సుబ్రహ్మణ్యం నటించడం విశేషం. గాత్రమే కాదు నటన కూడా బాలుకు ప్రాణమే. చాలా చిత్రాల్లో గెస్ట్ రోల్‌ కూడా పోషించారు. కొన్ని సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీ భవ తదితర చిత్రాల్లో ఆయన అద్భుతంగా నటించి మెప్పించారు. తెలుగుతోపాటు తమిళంలోని కొన్ని చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ ఉన్న పాత్రాలు పోషించి అందులో జీవించారు. అలాంటి చిత్రాల్లో ఒకటి మిథునం. తమిళంలో మూన్ మును వార్‌థై... సినిమాగా వచ్చింది. ప్రముఖ నటి లక్ష్మీ సరసన అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

అలుపెరుగని ఈ సంగీత యోధుడికి... ప్రతి నిత్యం ఒక కొత్త పాటపాడినిదే పొద్దుపోదు. అది సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, భక్తి కావచ్చు. పాటల్లో మునిగి తేలితే తప్ప తృప్తి ఉండదు. పాటలు పాడడంతోపాటు తెలుగు, కన్నడలో రెండు పాటల గ్రాండ్ రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి కొత్త కళకారులకు ప్రోత్సహించారు.

Tags

Read MoreRead Less
Next Story