మరింత క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలి వస్తున్న ప్రముఖులు

మరింత క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలి వస్తున్న ప్రముఖులు
సంగీత ప్రపంచం అంతా ఎస్పీ బాలు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు.

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు ఆసుపత్రి వర్గాలు. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వెల్లడించారు. ఎక్మోతో పాటు వెంటిలేటర్‌. ఇతర ప్రాణాదార చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.15 రోజులపాటు కరోనాతో పోరాడారని వెల్లడించారు. దీంతో సంగీత ప్రపంచం అంతా ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు.

సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌, థమన్‌లు అందరూ బాలుగారి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరుతూ.. ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సోషల్‌ మీడియా ట్విట్టర్‌ ద్వారా కోరారు. కాగా, బాలు ఆరోగ్యం మరింత క్షీణించటంతో.. పలువురు ప్రముఖులు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి కి తరలి వస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story