ఆ వార్తల్లో నిజంలేదు.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఎంజీఎం క్లారిటీ

ఆ వార్తల్లో నిజంలేదు.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఎంజీఎం క్లారిటీ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఊపిరితిత్తుల్లో పూర్తిగా తొలిగిపోలేదని.. దీంతో ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారని అన్నారు. అయితే, ఆయన ఆరోగ్యం గతంలో కంటే చాలా మెరుగుపడిందని అన్నారు. ఇటీవల ఎస్పీ బాలుకి ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేష‌న్ కొన‌సాగుతుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. దీనిపై ఎంజీఎం ఆస్ప‌త్రి క్లారిటీ ఇచ్చింది. ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఊప‌రితిత్తుల ట్రాన్స్ ప్లాంటేష‌న్ జ‌రుగుతుందనే వార్తల్లో నిజంలేదని తేల్చిచెప్పారు. కాగా.. నాన్న‌కు క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వచ్చింద‌ని, ఆయ‌న‌కు ఫిజియోథెర‌పీ కొన‌సాగిస్తున్నారని ఎస్పీ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story