బ్రేకింగ్.. బాలు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

బ్రేకింగ్.. బాలు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.... ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్లు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.... ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్లు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు బాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు ఆసుపత్రి వర్గాలు. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వెల్లడించారు. ఎక్మోతో పాటు వెంటిలేటర్‌. ఇతర ప్రాణాదార చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.15 రోజులపాటు కరోనాతో పోరాడారని వెల్లడించారు.

బాలు... కరోనా నుంచి కొలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోనే గత 40 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా సోకడంతో చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంటుంది. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఆయన అభిమానుల్లో టెన్షన్‌ మొదలైంది. ఎస్పీ బాలు ఆరోగ్యంపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story