ఆయన ప్రోత్సాహంతో సంగీత దర్శకుడిగా మారిన బాలసుబ్రమణ్యం

సంగీత ప్రపంచంలో పాటల రారాజు గా వెలుగొందుతూనే.. బాల సుబ్రమణ్యం స్వర కర్తగానూ కొన్ని మైలురాళ్ళను నెలకొల్పారు. ఏ గాయకుడికి దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశానికి బాలు తనదైన ప్రతిభతో కొత్త సొగసులు అద్దారు. బాలు సంగీత స్వర ప్రయాణంలో అరుదైన పాటలు వేలల్లోనే ఉన్నాయి. గాయకుడిగానే కాకుండా స్వరకర్తగా బాలు గౌరవ ప్రదమైన ప్రయాణం చేసారు. గాయకుడుగా 40 వేల పాటలకు ప్రాణం పోసిన బాలు, 50 చిత్రాలకు పైగా సంగీతం అందించారు.
కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో, ప్రయోగాలకు ముందుండంలో దిట్ట అయిన దాసరి నారాయణరావు గారి చొరవతో బాల సుబ్రమణ్యం స్వరకర్తగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం కన్యాకుమారి. నరసింహారాజు, శ్రీవిద్య జంటగా నటించిన ఈ చిత్రం లోని పాటలు ఆదరణ పోందాయి. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలకు సంగీతం అందించారు బాల సుబ్రమణ్యం. దాసరి చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం సంగీతకు బాల సుబ్రమణ్యం సంగీతం అందించారు.
దాసరి ప్రోత్సాహంతో సంగీత దర్శకుడిగా మారిన బాలసుబ్రమణ్యం అదే ప్రోత్సాహాంతో ప్రయోగాత్మక చిత్రాలకే కాదు.. క్రేజీ కాంబినేషన్స్ కి స్వరాలు సమకూర్చారు.
అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ క్రిష్ణ కాంబినేషనలోని మూవీ ఊరంతా సంక్రాంతికి బాలు అందించిన స్వరాలు ఆ సినిమా మూడ్ ని మరింత ఎలివేట్ చేసి నిజంగానే టైటిల్ కి తగ్గట్టు పండగలాంటి పాటలతో హుషారెత్తించారు బాలు. ఆ సినిమా విజయంలో బాలు ముద్ర స్పష్టంగా కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com