బాలు ప్రయాణంకి సరికొత్త దారి చూపించిన బాపు..

దాసరి వేసిన పునాదులపై బాలు స్వర ప్రయాణం జోరందుకుంటున్న సమయంలో ఆ ప్రయాణంకి సరికొత్త దారి చూపించారు దర్శకుడు బాపు. బాలుపై సంగీత దర్శకులు సత్యం, రమేష్ నాయుడుల ప్రభావం మెండుగా ఉండేది. ఆ ప్రభావంలో నుంచి బయటకు తెచ్చే ప్రయత్నంలో దర్శకుడు బాపు సక్సెస్ అయ్యారు. సత్యం గారిని బాలు నాన్న అని పిలుచుకునే వారు. ఆ ప్రేమ తన సంగీతం మీద కూడా తెలియకుండా పడేది. సత్యం గారి పాటల్లో వినిపించే గిటార్, డోలక్, దరువు శబ్దాలు బాలు మ్యూజిక్ లో కూడా వినిపించేవి ఆ ప్రభావం నుండి బయటకు తెచ్చిన బాపు బాలును స్వరకర్తగా మరో ఫేజ్ లోకి తీసుకెళ్ళారు..
అనుకరణ నుండి బయట పడి తన సహాజత్వంలో ప్రయాణం చేయడం నేర్చుకున్న బాలు స్వరరాగ ప్రయాణం మరింత అందంగా సాగింది. నటన నుండి సహాజ నటన రాబట్టుకున్నట్లే సంగీత దర్శకుడి గా ఉన్న బాలు నుండి కూడా అదే పని చేసారు బాపు ఆ ప్రభావం నుండి బయటకు వచ్చిన బాలు చేసిన సంగీతం తొలి పొద్దు అంత అందంగా మారింది. బాలు స్వర కర్తగా తన దారిని తాను వేసుకోవడం మొదలు పెట్టారు. దానికి అత్యంత ప్రతిభావంతుడైన బాపు అండదండలు దొరకడంతో ఆ ప్రయాణం మరింత కొత్త గా మారింది. వీరి ప్రయాణం తూర్పు వేళ్ళే రైలుతో మొదలయ్యి సీతమ్మ పెళ్ళి , జాకీల వరకూ సాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com