బాలు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన మూవీ..

బాలు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన మూవీ..
ఘంటసాల తర్వాత తెలుగు సినిమాకు ఆయనే పెద్ద దిక్కయ్యారు. బాలు సినీ జీవితాన్ని ఆ సినిమా పూర్తిగా మార్చేసింది.

గాత్రంతో గమ్మత్తు చేయడంలో బాలు దిట్ట. సినిమా చూసినవారికి ఆ హీరోనే పాటపడుతున్న ఫీలింగ్ కలిగేలా చేయడం బాలు స్పెషాలిటీ. ఘంటసాల తర్వాత తెలుగు సినిమాకు ఆయనే పెద్ద దిక్కయ్యారు. బాలు సినీ జీవితాన్ని శంకరాభరణం సినిమా పూర్తిగా మార్చేసింది. అప్పటిదాకా మాస్ పాటలకే పరిమితమైన బాలు... శంకరాభరణంతో క్లాసికల్ పాటలను అత్యద్భుతంగా పాడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బాలు పాటలు పండితులకే కాదు పామరులకూ చేరువ చేసింది.

బాలసుబ్రహ్మణ్యం సినీ జీవితాన్ని శంకరాభరణం చిత్రం మలుపు తిప్పింది. ఈ సినిమా పాటలు బాలుకు మొదటి జాతీయ అవార్డును తెచ్చిపెట్టాయి. దాంతో ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. ఆ తర్వాత బాలీవుడ్ డిబట్ చిత్రం ఏక్ దుజ్‌ కే లియే పాటలకు రెండో జాతీయ అవార్డు వరించింది. తేరే మేరే బీచ్‌ మే, మేరే జీవన్ సాథీ పాటలు బాలుకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చాయి. ఆ తర్వాత తేరే పాయల్ మేరే గీత్ పాటను ప్రముఖ గాయని లతా మంగేశ్కర్‌తో కలిసి పాడడాన్ని బాల సుబ్రహ్మణ్యం ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story