బాలు గారిని పూర్తిగా దివాలా తీయించాడన్నారు : ఎస్పీ చరణ్

బాలు గారిని పూర్తిగా దివాలా తీయించాడన్నారు : ఎస్పీ చరణ్
ఎస్పీ చరణ్.. ఎస్పీ బాలు కుమారుడిగా అందరికి సుపరిచితుడే.. అనుకోకుండా సింగర్ అయి.. అరె అచ్చం వాళ్ళ నాన్న లాగే పాడుతున్నారే అనే పేరును సంపాదించుకున్నాడు.

ఎస్పీ చరణ్.. ఎస్పీ బాలు కుమారుడిగా అందరికి సుపరిచితుడే.. అనుకోకుండా సింగర్ అయి.. అరె అచ్చం వాళ్ళ నాన్న లాగే పాడుతున్నారే అనే పేరును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి మంచి చిత్రాలానే చేశారు కానీ .. లాభాలు అయితే రాలేదు. సినిమాల ద్వారా డబ్బు పోవడంతో ఆర్ధికంగా అప్పుడప్పుడే కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో తండ్రి హఠాన్మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది... ఆ బాధ నుంచి కోలుకుంటూ ప్రస్తుతం 'పాడుతా తీయగా' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

చరణ్ పుట్టింది చెన్నైలోనే.. అమెరికాలో చదువుకున్నారు. చదువు పూర్తి అయ్యాక సినిమాల్లో సెటిల్ అవ్వాలని అనుకున్నారు. ఓసారి బాలు కారు డ్రైవరు రాకపోతే ఆయన్నీ ప్రసాద్‌ స్టూడియోస్‌లో దింపడానికి వెళ్ళినప్పుడు చరణ్ ని చూసిన మాస్ట్రో ఇళయరాజా 'పుణ్యవతి' అనే తమిళ్‌ సినిమాలో ఓ పాట పాడించారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఇళయరాజానే మళ్ళీ కన్నడ సినిమాల్లో పాడించారు. దీనితో బాలు గారి అబ్బాయి పాటలు పడుతున్నాడట అని వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత అవకాశాలు రావడం.. అచ్చం బాలు లాగే పాడుతున్నాడనే పేరు రావడంతో సింగర్‌‌గా చరణ్ ఫుల్ క్లిక్ అయ్యాడు.

ఆ తరవాత 'క్యాపిటల్‌ ఫిలిం వర్క్స్‌' అనే సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించి సముద్రఖని దర్శకుడిగా 'ఉన్నై శరణడైందేవ్‌' అనే సినిమాని చేశారు చరణ్.. ఈ సినిమాకి ప్రశంసలు, అవార్డులు అయితే వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. ఆ తరువాత తెలుగులో వచ్చిన 'వర్షం' సినిమాని తమిళ్‌‌లో రిమేక్ చేశారు. సినిమాకి లాభాలు వస్తాయని కాస్త ఎక్కువగానే డబ్బులు ఖర్చు పెట్టారు చరణ్.. కానీ డబ్బు పూర్తిగా పోయి నష్టాలే వచ్చాయి. ఆ తరవాత తక్కువ బడ్జెట్‌లో పలుసినిమాలు తీసినప్పటికీ అవార్డులే తప్ప పైసా లాభాలు రాలేదు.

దీనికితోడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంట్లోనే స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతో పెద్ద స్టూడియోలకు పని లేకుండా పోయింది. అందులో బాలు కట్టిన కోదండపాణి స్టూడియోస్‌ కూడా ఒకటి. దాని నుంచి లాభాలు రాకపోవడంతో అందులో పని చేసేవారిని మరొక చోట పని ఇప్పించి స్టూడియోలో మార్పులు చేయించారు. దీనితో బాలూగారు ఆస్తులు అమ్ముకుంటున్నారు. దానికి కారణం వాళ్ల అబ్బాయే అని పలు పత్రికలు రాశాయి. ఆ వార్తలు తనని అపరాధభావానికి లోనయ్యేలా చేశాయని చరణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ అమ్మానాన్నా చెప్పిన మాటలే తనలో చాలా దైర్యాన్ని నింపాయని చరణ్ చెప్పుకొచ్చారు.

కొండంత దైర్యాన్ని కోల్పోయిన చరణ్ ఇప్పుడు ఇప్పుడు 'పాడుతా తీయగా' ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన తండ్రి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో చరణ్ కూడా సక్సెస్ అవ్వాలని మనము కోరుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story