క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం.. అభిమానుల్లో టెన్షన్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కరోనా నుంచి కొలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోనే గత 40 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా సోకడంతో చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలు మళ్లీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఎంజిఎం వైద్యులు బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.
ఆగస్టు 5న కరోనా ఎస్పీ బాలు ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. అటు తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వివరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నా.. ఆయన ప్రస్తుతం చికిత్స కొనసాగుతునే ఉంది.
ఈ నెల 19 నుంచి ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎలాంటి బులిటెన్ విడుదల చేయడంలేదు. ఆయన ఆరోగ్యం మెరుగుపడి కోలుకుంటున్నారనుకున్న సమయంలో తిరిగి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. మళ్లీ అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో.. ఆయన అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఎస్పీ బాలు ఆరోగ్యంపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com