బాలు గాత్రానికి ముగ్దుడైన ఎంజీఆర్.. రెండు నెలల పాటు..

బాలు గాత్రానికి ముగ్దుడైన ఎంజీఆర్.. రెండు నెలల పాటు..
ఆ పాట MGRకు చాలా బాగా నచ్చింది. కానీ అంతలోనే బాలు అనారోగ్యం పాలయ్యారు.

ఆయన పాట పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. ఆయన స్వరం నుంచి ఏ పాటు జాలువారినా చెవులకు ఇంపే. ఆయనకు భాషతో సంబంధం లేదు. తెలుగు నుంచి హిందీ వరకు ఎన్నో భాషల్లో పాటలు పాడి గిన్నిస్ రికార్డులకు ఎక్కారు. తన గాత్రంతో దేశ ప్రజలకు చేరువైన ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ గాన గంధర్వుడు గళం విప్పితే దివిలో తిరిగే దేవతలైనా భువికి రావల్సిందే. అంతటి మధురమైన స్వరంతో అలరించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... బహుముఖ ప్రజ్ఞాశాలి.

అది 1969. ఓ రోజు AVM ప్రొడక్షన్స్ స్టూడియోలో కమ్మని స్వరం MGR చెవిన పడింది. దానికి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అది ఎవరిదో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓ 20 ఏళ్ల తెలుగు కుర్రాడు తెలుగు సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్నాడు. ఆ యువకుడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అతడి గాత్రానికి ముగ్దుడైన MGR బాలసుబ్రహ్మణ్యంకు తన చిత్రంలో పాటపాడే అవకాశం ఇచ్చారు. ఆదిమై పెన్ అనే చిత్రంలో అయిరం నిలవే వా అనే పాట రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు బాలు. ఆ పాట MGRకు చాలా బాగా నచ్చింది. కానీ అంతలోనే బాలు అనారోగ్యం పాలయ్యారు. చాలా రోజులు వేచిచూసిన MGR చివరికి ఆ పాటను వేరే సింగర్‌తో పాడించారు. కానీ MGR చెవుల్లో బాలు పాటనే మార్మోగుతోంది. దీంతో బాలు కోలుకునే వరకు రెండు నెలలపాటు MGR నిరీక్షించిమరీ పాటలు పాడించారంటే ఆ యువ గాత్రం ఎంతగా మెస్మరైజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత బాల సుబ్రహ్మణ్యంకు తమిళంలో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆయన తెలుగుతోపాటు తమిళంలోనూ ఫేమస్ అయ్యారు. అనంతరం దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ చాలా పాటలు పాడి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు.

MGR తర్వాత శివాజీ గణేషన్, ఎన్టీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి ఎంతోమంది ప్రముఖ నటులకు పాటలు పాడిన ఘనత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంది. దాదాపు 50 ఏళ్లుగా మూడు తరాల నటులకు ముచ్చటగా పాటలు పాడినా.. ఇంకా ఎన్నో తరాలు గుర్తుంచుకునే స్వరం ఆయనది. గాన గాంధర్వుడి పాటల ప్రస్థానానికి ఐదేళ్ల క్రితం గోల్డెన్ జూబ్జీ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story