బాలులో ఉన్న ఆ ప్రత్యేకత శివాజీ గణేషన్‌కు నచ్చక.. ఏం చేశారంటే?

బాలులో ఉన్న ఆ ప్రత్యేకత శివాజీ గణేషన్‌కు నచ్చక.. ఏం చేశారంటే?
శివాజీ గణేషన్‌కు మాత్రం ఇది నచ్చలేదట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో బాల సుబ్రహ్మణ్యమే స్వయంగా వెల్లడించారు.

బాల సుబ్రహ్మణ్యం ప్రత్యేకత ఏంటంటే... ఏ స్టార్‌ హీరోకు పాటపడినా... అచ్చు ఆ హీరో వాయిస్‌ లాగే ఉండడం. అయితే శివాజీ గణేషన్‌కు మాత్రం ఇది నచ్చలేదట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో బాల సుబ్రహ్మణ్యమే స్వయంగా వెల్లడించారు. తన స్వరాన్ని పోలినట్లు పాటలు పాడడానికి ప్రయత్నించొద్దన్నారట. కానీ పాటకు తగ్గట్లు తన యాక్టింగ్‌ను మలుచుకుంటానన్నారట. ఉరకలేసే ఉత్సాహం, సంతోషం, సరదా, విషాదం ఇలా సందర్భానికి తగినట్లు పాటకు జీవం పోయడం బాల సుబ్రహ్మణ్యం ప్రత్యేకత. అలాంటి బాలు పాటల పూదోటలో కొన్ని.. మేరే జీవన్ సాథి..., ప్యార్ కియా జాయ్, నిలావే వా పాటలతోపాటు శంకరాభరణం, సాగర సంగమం స్వరాల్లో ఆయన గాత్రం ప్రత్యేకత కనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గాత్ర మాధుర్యానికి ఏకంగా ఆరు జాతీయ అవార్డులు వరించాయి.

Tags

Read MoreRead Less
Next Story