HBD Kota srinivasa Rao : 'కోటా'కి మొదటి నంది అవార్డు తెచ్చిపెట్టిన పాత్ర ఏంటో తెలుసా?

పాత్ర ఏదైనా సరే అందులో పరయకాయ ప్రవేశం చేసి సినిమా సక్సెస్‌లో సగం క్రిడెట్ కొట్టేసే అతికొద్ది మంది నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు. సినిమాల పైన ఉన్న పిచ్చితో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలో ఇప్పటికి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత 'శభాష్ కోటా' అని అనిపించుకున్న ఆయన.. నేడు 75 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
'ప్రాణం ఖరీదు' సినిమాతో మొదలైంది కోటా సినీ ప్రస్థానం.. విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా ఇలా ఎన్నో వేరియేషన్ ఉన్న పాత్రలను పోషించారయన. అయితే విలన్‌గా ప్రతిఘటన సినిమాలో ఆయన కనబరించిన నటన.. ప్రేక్షకుల చేత చెప్పట్లు కొట్టించింది. ఆ పాత్రే ఆయనకి మొదటి నంది అవార్డుని తీసుకొచ్చింది. అంతటి విలనిజాన్ని పండించిన ఆయన తన తదుపరి సినిమాలో పూర్తి కామెడీతో మెప్పించారు. ఆ సినిమానే ఆహనా పెళ్ళంటా.. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలెస్ అనే చెప్పాలి.
ఈ పాత్రలో మనం మరో నటుడిని ఉహించుకోలేము కూడా.. ఇక బాబు మోహన్‌తో కోటా కామెడీ అదుర్స్ అనే చెప్పాలి. ఈ కాంబినేషన్‌ని పెట్టి దర్శకులు సినిమాలే ప్లాన్ చేశారంటే అతిశయోక్తి కాదేమో. ఇలాగే మరెన్నో పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను కోటా మరింతగా మెప్పించాలని మనము కోరుకుందాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com