సోనూసూద్ కి అరుదైన గౌరవం..స్పైస్‌జెట్‌ విమానంపై.. !

సోనూసూద్ కి అరుదైన గౌరవం..స్పైస్‌జెట్‌ విమానంపై.. !
లాక్ డౌన్ సమయంలో అందించిన సహాయ సహకరాలకు గౌరవంగా.. తమ స్పైస్ జెట్ బోయింగ్ 737విమానంపై సోనూసూద్ ఫోటోను ఉంచింది.

అడిగిన వారికి లేదంటూ సహాయన్నీ అందిస్తూ హెల్పింగ్ స్టార్ గా ఎదిగిన నటుడు సోనూసూద్ కి అరుదైన గౌరవం లభించింది. స్పైస్ జెట్ విమానయాన సంస్థ తనదైన రీతిలో అరుదైన గౌరవాన్ని కల్పించింది. లాక్ డౌన్ సమయంలో అందించిన సహాయ సహకరాలకు గౌరవంగా.. తమ స్పైస్ జెట్ బోయింగ్ 737విమానంపై సోనూసూద్ ఫోటోను ఉంచింది. అంతేకాకుండా ఆపద్బాంధవుడు.. సోనూసూద్ కి సెల్యూట్ అని రాసింది. కాగా ఓ దేశీయ విమానయాన సంస్థ.. తన సొంత ఖర్చులతో ఓ వ్యక్తికి ఇలా గౌరవాన్ని ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.. కాగా స్పైస్‌జెట్‌ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. తనకి చేతనైనంత వరకు సాయం చేస్తూనే ఉంటానని తెలిపాడు.
Tags

Read MoreRead Less
Next Story