Sravana Bhargavi: వివాదంలో సింగర్ శ్రావణ భార్గవి.. అన్నమయ్య సంకీర్తనే కారణం..

Sravana Bhargavi: ఫేమస్ సింగర్ శ్రావణ భార్గవి చిక్కుల్లో పడ్డారు.. తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.. అన్నమయ్యను అవమానించారంటూ ఆయన వంశస్థులు మండిపడుతున్నారు.. అన్నమాచార్య సంకీర్తనను రొమాంటిక్ సాంగ్‌గా మార్చారంటూ ఫైరవుతున్నారు.. ఆ వీడియో వెంటనే తొలగించాలని అన్నమయ్య వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఒకపరి ఒకపరి వయ్యారమే అనే సంకీర్తనను ఇటీవలే శ్రావణ భార్గవి పాడారు.. ఆ పాటకు వీడియో చేసి తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.. ఈ వీడియో వైరల్‌గా మారగా, విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.. ఆ వెంకటేశ్వరుడిపై అన్నమయ్య రాసిన పాటను అపహాస్యం చేశారంటూ అన్నమయ్య వంశీయులు శ్రావణ భార్గవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపరి వయ్యారమే అనే కీర్తన స్వామి, అమ్మవార్లకు చెందినదని.. దీనిని తనకు ఆపాదించుకుని చిత్రీకరణ చేయడం సరికాదని మండిపడుతున్నారు.
ఇదే విషయమై కొంతమంది శ్రీవారి భక్తులు శ్రావణ భార్గవికి ఫోస్ చేసి మాట్లాడిన ఆడియో కూడా వైరల్ అవుతోంది.. ఈ ఆడియోలో శ్రావణ భార్గవి వివరణ కూడా స్పష్టంగా ఉంది. తాను చేసిన వీడియోలో అశ్లీలం ఏముందని ఆమె ప్రశ్నించారు. తానూ భారతీయ మహిళనే.. బ్రాహ్మణ అమ్మాయినే అని.. ఆ వీడియో చేయడంలో తప్పు ఏముందంటూ ఎదురు ప్రశ్న వేశారు.. తనకూ సంప్రదాయాలు తెలుసునన్నారు.. చూసే చూపులోనే అశ్లీలం ఉందంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.. అంతేకాదు, ఆ పాటకు సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో కామెంట్ సెక్షన్‌ను హైడ్ చేశారు.
అయితే, ఈ విషయంలో శ్రావణ భార్గవిని తోటి సింగర్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు.. ఆ వీడియోలో అభ్యంతరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.. గతంలో ఇలాంటి ఎన్నోపాటలను చిత్రీకరించిన విషయాలను గుర్తు చేస్తున్నారు.. ఓ పెద్ద స్టార్ హీరో నటించిన సినిమాలో ఎందరో మహానుభావులు పాట చిత్రీకరణపై రాని విమర్శలు.. ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com