16 March 2023 12:06 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Sridevi Shobanbabu:...

Sridevi Shobanbabu: ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోన్న సోగ్గాళ్లు...

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శ్రీదేవి శోభన్ బాబు

Sridevi Shobanbabu: ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోన్న సోగ్గాళ్లు...
X

చిరంజీవి తనయ సుస్మిత నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన శ్రీదేవీ శోభన్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సంతోశ్ శోభన్, గౌరీ కిషన్ జంటగా నటించిన ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందింది. కుటుంబం సాంతం వీక్షించదగ్గ చిత్రంగానూ పేరు గడించింది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 30 నుంచి శ్రీదేవి శోభన్ బాబు స్ట్రీమింగ్ అవ్వబోతోంది. మరి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్ము రేపుతుందేమో చూడాలి.

Next Story