Srinu Vaitla: విడాకులపై శ్రీను వైట్ల క్లారిటీ.. జీవితాన్ని ఊహించుకోలేనంటూ..

Srinu Vaitla: టాలీవుడ్‌లో విడాకుల వ్యవహారాలు ఎక్కువయిపోతున్నాయి. మనస్పర్థలతో విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఎక్కువగా నటీనటులే విడాకుల బాట పట్టగా తాజాగా డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అనిపించేలా శ్రీను వైట్ల తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
శ్రీను వైట్ల భార్య రూప వైట్ల కూడా సినిమాల్లో డిజైనర్‌గా పనిచేస్తోంది. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయని, అందుకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా నాలుగేళ్లుగా శ్రీను వైట్ల, రూపా వైట్ల విడివిడిగానే ఉంటున్నారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే శ్రీను వైట్లతో విడిపోవాలని నిర్ణయించుకున్న రూపా.. విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్టు సమాచారం.
ఆ తర్వాత వీరి విడాకుల వ్యవహారం ఎక్కడ వరకు వచ్చిందో ఏ అప్డేట్ లేదు కానీ శ్రీను వైట్ల పెట్టిన పోస్ట్ చూస్తుంటే విడాకులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ తన ముగ్గురు కుమార్తెలతో దిగిన ఫోటోను షేర్ చేశారు. 'జీవితం అందమైనది. ప్రేమించిన వారితో ఉండే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను.' అని క్యాప్షన్ పెట్టారు. దీంతో విడాకుల వల్ల శ్రీను వైట్ల తన కుమార్తెలకు కూడా దూరమవ్వబోతున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Life is beautiful but with your loved ones it's more than beautiful. Can't imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU
— Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com