అల్లూరి సీతారామరాజు లుక్ అదుర్స్.. ఆర్ఆర్ఆర్ పోస్టర్ రిలీజ్.. రామ్‌చరణ్ బర్త్‌డే గిప్ట్

అల్లూరి సీతారామరాజు లుక్ అదుర్స్.. ఆర్ఆర్ఆర్ పోస్టర్ రిలీజ్.. రామ్‌చరణ్ బర్త్‌డే గిప్ట్
హీరో రామ్ చరణ్ బర్త్‌డే అభిమానులకు పండగే.. మరి ఆయన నటించిన సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు.

హీరో రామ్ చరణ్ బర్త్‌డే అభిమానులకు పండగే.. మరి ఆయన నటించిన సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుండి ఓ స్టన్నింగ్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. రామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో చరణ్‌కు సంబంధించిన ఓ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, ఆయన సరసన అలియా భట్ కథానాయికగా నటిస్తోంది. కొమరం భీంగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. కాల్పనిక కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. కాగా, ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రేపు విడుదల చేయనుంది ఆచార్య చిత్ర యూనిట్. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story