భారీ ధరకు అమ్ముడుపోయిన RRR డిజిటల్ హక్కులు.. !

భారీ ధరకు అమ్ముడుపోయిన RRR డిజిటల్ హక్కులు.. !
బాహుబలి చిత్రం తర్వాత.. టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు.

బాహుబలి చిత్రం తర్వాత.. టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. పిరియాడిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాహుబలి సినిమా తరవాత రాజమౌళి నుంచి సినిమా రావడం, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లు కలిసి నటిస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్‌ హక్కులు భారీ స్థాయిలో ఓ సంస్థ విక్రయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను అక్షరాలా రూ.200 కోట్లకు ఓ స్టార్‌ నెట్‌వర్క్‌ సంస్థ విక్రయించినట్లుగా సమాచారం.. అంటే... థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వస్తుందంటున్నారు.

సినిమా విడుదలకి ముందే... ఈ సినిమాకి 200 కోట్ల రూపాయల బిజినెస్‌ జరిగిందంటే.. ఇక థియేటర్లలో అడుగు పెట్టినప్పుడు ఇంకే రేంజ్‌లో బిజినెస్‌ జరుగుతుందోనని అభిమానులు అనుకుంటున్నారు. కాగా ఈ సినిమాని అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story