SS Thaman: డ్యాన్సర్‌గా మారిన తమన్.. స్టెప్పులు కుమ్మేశాడుగా!

SS Thaman: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విషయం ట్రెండ్ అవ్వాలంటే పెద్దగా సమయం పట్టడం లేదు. కొందరు సెలబ్రిటీలు దానిపై రీల్స్ చేస్తే చాలు.. ఏ విషయమైనా.. కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియా అంతా చుట్టేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలా వైరల్ అవుతున్న వాటిలో కళావతి ఛాలెంజ్ కూడా ఒకటి. పలువురు సెలబ్రిటీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి స్టెప్పులేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మహేశ్ బాబును తెరపై చూడాలని తన అభిమానుంతా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికే వస్తుంది అనుకున్న'సర్కారు వారి పాట' పదే పదే పోస్ట్‌పోన్ అవుతూ.. ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తూనే ఉంది. కానీ వారు డిసప్పాయింట్ అవ్వకుండా సర్కారు వారి పాట టీమ్ సాంగ్స్ సందడిని మొదలుపెట్టింది. అందులో భాగంగానే ముందుగా సినిమాలోని లవ్ సాంగ్ కళావతి పాటను విడుదల చేసింది.
తమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో కళావతి పాటను సిడ్ శ్రీరామ్ పాడాడు. అయితే ఈ పాట విడుదలయినప్పటి నుండి యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతూనే ఉంది. అంతే కాకుండా చాలాకాలం తర్వాత ఈ పాటలో వింటేజ్ మహేశ్‌ను చూశారు అభిమానులు. అందుకే ఈ పాటకు అందరూ ఫిదా అయిపోతున్నారు. అయితే పాటకు మరింత క్రేజ్‌ను తీసుకురావడం కోసం సోషల్ మీడియాలో కళావతి ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది మూవీ టీమ్.
ముందుగా మహేశ్ కూతురు సితార.. కళావతి ఛాలెంజ్‌ను స్వీకరించి స్టెప్పులేసింది. ఆ తర్వాత హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా కళావతి పాట కోసం తన స్టైల్ డ్యాన్స్‌ను చూపించింది. తాజాగా తమన్ కూడా ఈ పాట కోసం డ్యాన్సర్‌గా మారాడు. ఈ పాటను సినిమాలో కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌తో తమన్ వేసిన స్టెప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com