Maa Association : అంతమంది ఉన్న 'మా'కు అవెందుకు లేవో మరి..!

Maa Association : ఇప్పటివరకు 'మా' ఎన్నికలు అంటే ఇండస్ట్రీకి చెందినవి మాత్రమే.. అధ్యక్ష పదవి అంటే ఏకగ్రీవమే.. కానీ మరో మూడు రోజుల్లో జరగబోయే 'మా' ఎన్నికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జనరల్ ఎలక్షన్‌ని తలపిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ప్రకాష్‌రాజ్, విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేపోటీగా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. దీనితో ఈ సారి మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇందులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ఇదిలావుండగా ఓ మహోన్నత లక్ష్యంతో 26 ఏళ్ల క్రితం ఏర్పడిన 'మా' అసోసియేషన్ కి ఇప్పటివరకు సొంత భవనం అంటూ లేకపోవడం గమనార్హం. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికల్లో ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఈసారి కూడా అంతే.. మా కి సొంత భవనంతో పాటుగా ఎలాంటి వెబ్ సైట్ కానీ.. యాప్ కానీ.. కనీసం వికీపీడియా పేజ్ కానీ లేదు. దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అటు సినిమా సభ్యులకి కానీ ఇటు అభిమానులకి సాధ్యంపడడం లేదు. దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే యూట్యూబ్, పేపర్లలో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది.
అయితే ఈసారి తమ ప్యానల్ గెలిస్తే మా కి సొంత భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మిస్తానని అంటున్నారు విష్ణు.. . దీనికోసం ఇప్పటికే 3 స్థలాలను పరిశీలించడం జరిగిందని... అందరి అభిప్రాయం మేరకు భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 'మా' యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com