Allu Arjun : కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్నీ ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 15 రోజులు క్వారంటైన్ తర్వాత నాకు నెగెటివ్ అని నిర్దారణ అయింది. నేను కోలుకోవాలని ప్రార్ధించిన స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికి ధన్యవాదాలు. నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన అభిమానులు, సన్నిహితులకు కృతజ్ఞతలు. కరోనా కేసులు తగ్గించడంలో ఈ లాక్‌డౌన్ ఎంతగానో ఉపయోగపడుతోందని భావిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని తెలిపారు. మరోవైపు బన్నీకి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిసి ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com