Sudhakar Komakula: తండ్రైన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' యాక్టర్.. క్యూట్ పోస్ట్ షేర్..

Sudhakar Komakula: అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకునే యంగ్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకరు సుధాకర్ కోమాకుల. తన పేరు చెప్పగానే ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టకపోవచ్చు. కానీ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నాగరాజు అంటే చాలామంది టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ యంగ్ హీరో తండ్రయ్యాడు. తన కొడుకు పేరుతో పాటు ఓ అందమైన పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సుధాకర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.
టాలీవుడ్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల స్టైలే డిఫరెంట్. పేరున్న నటీనటులతో కంటే, స్టార్ హీరోలతో కంటే కొత్తవారితో సినిమాలను తెరకెక్కించడానికే శేఖర్ కమ్ముల ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి చిత్రాలతో ఎంతోమంది నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అందులో ఒకడు సుధాకర్ కోమాకుల. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత సుధాకర్ పలు చిత్రాల్లో నటించినా కూడా తనకు మళ్లీ ఆ రేంజ్‌లో క్రేజ్ రాలేదు.
తను తండ్రైన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు సుధాకర్. 'హ్యాపీ న్యూస్. మే 14న అమెరికాలోని చికాగోలో మాకు కొడుకు పుట్టాడన్న విషయం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతడికి మేము రుద్ర అని శివుడి పేరు పెట్టుకున్నాం. మీ ఆశీస్సులు మాకు కావాలి' అని పోస్ట్ పెట్టాడు సుధాకర్. అంతే కాకుండా తన భార్య, కొడుకుతో సుధాకర్ పెట్టిన పోస్ట్‌కు తెగ లైకులు కొడుతున్నారు నెటిజన్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com