26 Aug 2021 4:38 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / వామ్మో.. అప్పుడే...

వామ్మో.. అప్పుడే సుడిగాలి సుధీర్ అంత సంపాదించాడా.. !

జబర్దస్త్ అనే ప్లాట్ ఫాం ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. అందులో సుడిగాలి సుధీర్‌ ఒకరు.

వామ్మో.. అప్పుడే సుడిగాలి సుధీర్ అంత సంపాదించాడా.. !
X

జబర్దస్త్ అనే ప్లాట్ ఫాం ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. అందులో సుడిగాలి సుధీర్‌ ఒకరు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే మనోడు మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దీనితో సుధీర్‌‌‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటు కమెడియన్‌‌గా కొనసాగుతూనే వెండితెర పై కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. సినిమాలతో, షోలతో ఫుల్ బిజీగా లైఫ్‌‌ని లీడ్ చేస్తున్నాడు సుధీర్. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కామెడీ షోలో సుధీర్‌ తన ఆస్తులపై స్పందించాడు. సుధీర్ ఆస్తులను విన్నావారంతా షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో సుధీర్‌‌కి రెండు సొంతిళ్లు ఉన్నాయట. అంతేకాకుండా పలు స్థిరాస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. హైదరాబాదులో ఒక ఇళ్లు కొనడమే కష్టమని అనుకుంటే ఏకంగా రెండు ఇల్లులు కొన్నాడంటే సుధీర్ బాగానే సంపాదించి ఉంటాడని నెటిజన్లు అనుకుంటున్నారు. అవకాశాల కోసం హైదరాబాదుకి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్‌‌లో పడుకున్నానని పలుమార్లు సుధీర్ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సుధీర్ ఇప్పుడు ఇలా ఎదగడం పట్ల అభిమానులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ఒక్కో ఎపిసోడ్ కి సుధీర్ నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాడట.

Next Story