Sriranganeethulu: సుహాస్‌ 'శ్రీరంగనీతులు'

Sriranganeethulu: సుహాస్‌ శ్రీరంగనీతులు
కలర్‌ఫోటొ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న నటుడు సుహాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే రైటర్‌ పద్మభూషన్‌ సినిమాతో హిట్‌ కొట్టి చేతినిండా ప్రాజెక్ట్స్‌తో గడిపేస్తున్నాడు యంగ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌

"కలర్‌ఫోటొ" సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న నటుడు సుహాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే "రైటర్‌ పద్మభూషన్‌" సినిమాతో హిట్‌ కొట్టి చేతినిండా ప్రాజెక్ట్స్‌తో గడిపేస్తున్నాడు యంగ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌. ఈ క్రమంలోనే మరో మల్టీ స్టారర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటేశ్వర రావు బల్మూరి నిర్మాణంలో ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకుడిగా రూపు దిద్దుకుంటున్న సినిమా "శ్రీరంగనీతులు". ఈ సినిమాలో సుహాస్‌తో పాటు "కేరాఫ్‌ కంచెరపాలం" ఫేమ్‌ కార్తిక్‌ రత్నం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

వీరితో పాటు రుహానీ శర్మ, విరాజ్‌ అశ్విన్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు అప్‌డేట్స్‌ ఎప్పటికప్పడు మేకర్స్‌ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృదం విడుదల చేసింది. సుహాస్‌ ఈ సినిమాతో పాటు ఆనందరావు అడ్వేంచర్స్‌ అనే టైటిల్‌తో మరో సినిమా కూడా మొదలు పెట్టాడు. ఆ సినిమాకు రామ్‌ పసుపులేటి దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌కు కూడా మంచి స్పందనే లభించింది. అయితే ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story