'సుల్తాన్' ట్విట్టర్ రివ్యూ..

సుల్తాన్ ట్విట్టర్ రివ్యూ..
ఆయన పక్కన హీరోయిన్‌గా నటించిన రష్మికకి ఇదే మొదటి తమిళ చిత్రం కావడం విశేషం.

తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు 'ఊపిరి'తో బాగా కనెక్ట్ అయ్యారు. తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. తాజాగా సుల్తాన్ అంటూ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇక ఆయన పక్కన హీరోయిన్‌గా నటించిన రష్మికకి ఇదే మొదటి తమిళ చిత్రం కావడం విశేషం.

విడుదలకు ముందే భారీ హైప్‌ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రౌడీల నుంచి ఓ గ్రామాన్ని కాపాడిన యువకుడి కథే సుల్తాన్. గ్రామ రక్షకుడిగా రౌడీలతో ఓ యువకుడు ఎలా పోరాడి గెలిచాడన్నదే కథాంశం. గత రాత్రి సినిమా చూసిన యూఎస్ ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కార్తీ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎన్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. మొత్తంగా ఈ సినిమా ఓ ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ అని ప్రేక్షకులు కితాబిస్తున్నారు.

కార్తీ, రష్మిక కెమిస్ట్రీ అదిరిందని అంటున్నారు. సినిమాలో చూపించిన సీన్స్ పాతవే అయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేసినందుకు అభినందనీయం అని పేర్కొంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story