యాంకర్ సుమ ఎమోషనల్ పోస్ట్..

యాంకర్ సుమ ఎమోషనల్ పోస్ట్..
అందుకేనేమో చిన్నా పెద్దా అంతా తన ఫ్యాన్స్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సుమ ఫ్యామిలీలో భార్యా భర్తల మధ్య గొడవలు..

సుమ అంటే తెలియని తెలుగింటి ప్రేక్షకులు ఉండరేమో.. వెండి తెర మీద బ్రహ్మానందం కనిపిస్తే సగటు ప్రేక్షకుడికి ఎంత ఆనందమో.. బుల్లి తెర మీద సుమ కనిపిస్తే అంత సంతోషం.. ఆమె తెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. యాంకర్‌గా అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలైనా ప్రేక్షకులకు బోరు కొట్టలేదంటే అది ఆమెలోని హాస్య చతురతకు అద్దం పడుతుంది.

నొప్పించక, తానొవ్వక షోను ఆధ్యంతం రక్తి కట్టిస్తుంది.. ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది.. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తుంది. ఎవ్వరినీ వదిలి పెట్టకుండా స్పాంటేనియస్‌గా పంచులు వేస్తుంది. అందుకేనేమో చిన్నా పెద్దా అంతా తన ఫ్యాన్స్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సుమ ఫ్యామిలీలో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. అవి కాస్తా విడాకులకు దారి తీసాయని గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలను ఏమాత్రం పట్టించుకోని సుమ తాజాగా ఓ అందమైన పోస్ట్ పెట్టింది..

తమ బంధం చాలా బావుందంటూ నాలుగు వాక్యాల్లో అక్షరీకరించింది. భర్త రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సరదాగా గడిపిన ఫోటో షేర్ చేస్తూ నువ్వే నా బలం.. నువ్వే నా సర్వస్వం.. ఐ లవ్యూ రాజా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది.

'' నా ప్రియమైన రాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వే నా బలం, సంతోషం, నా జీవితంలో నువ్వు ఓ వరం, నీతోడుగా నడిచే ప్రతి అడుగు, ప్రతి రోజు కొత్తగా ఉండాలని కోరుకుంటున్నా.. లవ్ యూ" అంటూ భర్తపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసింది సుమ. ఈ ట్వీట్ చూసిన సుమ, రాజీవ్ ఫ్యాన్స్ .. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది.. హ్యాపీ బర్త్ డే రాజీవ్ అన్నా అని కామెంట్స్ చేస్తున్నారు. రాజీవ్ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప చిత్రంలో నటిస్తున్నారు. ఇక సుమ, రాజీవ్‌ల కొడుకు కూడా హీరోగా రాబోతున్నాడు.. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది.


Tags

Next Story