గురువు మరణం.. సునీత ఎమోషనల్ పోస్ట్..

సరిగమలు నేర్పిన సారు ఇకలేరంటూ సునీత దు:ఖ సాగరంలో మునిగిపోయింది. కోయిలమ్మకు పాటలు నేర్పిన పంతులు పెమ్మరాజు సూర్యారావు గారు స్వర్గస్థులయ్యారు. అమృతం తాగినట్లుండే ఆమె గాత్రంలో గమకాలు అవలీలగా పలుకుతాయి. మాష్టారికి ఓ మంచి స్టూడెంట్ అయిన సింగర్ సునీత.. గురువుగారిని కోల్పోవడం అత్యంత విషాదం అంటూ ఆయన ఫోటోని షేర్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సునీత పెమ్మరాజు సూర్యారావు గారు చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మహనీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉంది అని పోస్ట్ చేశారు. ఈ మధ్యే కొత్త జీవితాన్ని ఆరంభించిన సునీత యధావిధిగా తన పాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అభిమానులను ఆమె మృధు మధుర గానంలో ఓలలాడిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com