కారు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్.. స్టేజ్‌పైన ఏడ్చేసిన హీరో, హీరోయిన్..

కారు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్.. స్టేజ్‌పైన ఏడ్చేసిన హీరో, హీరోయిన్..
ప్రెస్‌మీట్ ‌లో ప్రవీణ్‌ని తలుచుకుని స్టేజ్ మీద భావోద్వేగానికి గురయ్యారు చిత్రయూనిట్.

మృత్యువు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు.. సినిమాలపై మక్కువతో దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర 'ప్రవీణ్' అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. దర్శకుడిగా 'సూపర్ ఓవర్' సినిమాకు పని చేస్తుండగా చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడు ప్రవీణ్ కారు ప్రమాదంలో కన్నుమూశారు.

అప్పటి వరకు తమతోనే ఉన్న వ్యక్తి అర్ధాంతరగా కన్నుమూయడం చిత్ర యూనిట్‌ని కలిచి వేసింది. ఆ బాధతోనే మిగిలిన చిత్రాన్ని దర్శకుడు సుధీర్ వర్మ పూర్తి చేశారు. సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ ‌లో ప్రవీణ్‌ని తలుచుకుని స్టేజ్ మీద భావోద్వేగానికి గురయ్యారు చిత్రయూనిట్. హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ చాందినీ చౌదరి కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇలాంటి ఓ మంచి చిత్రంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రవీణ్‌కు థ్యాంక్యూ.. ఈ చిత్రాన్ని ప్రవీణ్‌కి అంకితం చేస్తున్నాం. తను ఎక్కడ ఉన్నా ఈ చిత్రాన్ని వీక్షించి సంతోషిస్తాడని అనుకుంటున్నా.. మీతో కలిసి పని చేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది అంటూ నటి చాందినీ కన్నీరు పెట్టుకుంది.

అనంతరం నవీన్ చంద్ర మాట్లాడుతూ ప్రవీణ్ వర్మ చాలా మంచి వ్యక్తి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈ సినిమా కోసం టీమ్ మొత్తం ఎంతగానో శ్రమించింది. ప్రవీణ్ ఆశయాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో సుధీర్ ఈ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకుని పూర్తి చేశారు. షూటింగ్ సమయంలో ప్రతి రోజు ప్రవీణ్‌ని గుర్తు చేసుకునే వాళ్లం. ఆయన కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ హీరో నవీన్ చంద్ర ఎమోషనల్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story