"ఏం పాపం చేశాను ఫ్రెండ్స్".. సురేఖవాణి కూతురికి షాకిచ్చిన నెటిజన్లు..!

ఏం పాపం చేశాను ఫ్రెండ్స్.. సురేఖవాణి కూతురికి షాకిచ్చిన నెటిజన్లు..!
టాలీవుడ్ నటి సురేఖవాణి వాణి కూతురు సుప్రీత గురించి అందరికీ తెలిసిందే.. సోషల్ మీడియాలో సుప్రీత చాలా యాక్టివ్ గా ఉంటుంది.

టాలీవుడ్ నటి సురేఖవాణి వాణి కూతురు సుప్రీత గురించి అందరికీ తెలిసిందే.. సోషల్ మీడియాలో సుప్రీత చాలా యాక్టివ్ గా ఉంటుంది. సురేఖవాణితో కలిసి ఫోటోలు పెడుతూ అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది సుప్రీత.. త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా టాక్.. ఇదిలా ఉంటే... సుప్రీతకి భారీ షాక్ ఇచ్చారు నెటిజన్లు.. వరుస పోస్టులతో తన ఫాలోవర్లను పెంచుకుంటున్న సుప్రీతకి ఉహించని షాక్ ఇచ్చారు.

ఇన్‌‌‌స్టాగ్రామ్‌‌‌లో గత వారం రోజుల్లోనే కొత్తగా 321 మంది కొత్తగా ఫాలో అయితే..422 మంది అన్ ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో పంచుకుంటూ . "ఏం పాపం చేశాను ఫ్రెండ్స్‌ ... ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారు" అంటూ తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం సుప్రీతను ఇన్‌‌‌స్టాగ్రామ్‌‌‌లో 3లక్షల మంది ఫాలో అవుతున్నారు.
Tags

Read MoreRead Less
Next Story