13 Aug 2022 12:00 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Surekha Vani: సురేఖ...

Surekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..

Surekha Vani: సురేఖ వాణి.. డైరెక్టర్ సూరేష్ తేజను వివాహం చేసుకుంది. కానీ అనారోగ్య కారణం వల్ల 2019లో ఆయన కన్నుమూశారు.

Surekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
X

Surekha Vani: టాలీవుడ్‌లో హీరోహీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో.. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అలా వరుస సినిమాలతో బిజీగా మారడమే కాకుండా.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి. సురేఖ వాణి చేసే సినిమాల గురించే కాదు.. తన పర్సనల్ లైఫ్‌పై కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇక ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది.

సురేఖ వాణి.. డైరెక్టర్ సూరేష్ తేజను వివాహం చేసుకుంది. కానీ అనారోగ్య కారణం వల్ల 2019లో ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత తను, తన కూతురు సుప్రీతతోనే కలిసి ఉంటోంది. అంతే కాకుండా తనన కూతురి కలిసి రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఇప్పటికీ చాలామంది నెటిజన్లు కూతురికంటే సురేఖ వాణినే బాగుంది అంటూ ఓపెన్‌గా కామెంట్లు చేస్తారు.

ఇక సురేఖ వాణి రెండో పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. సురేఖ వాణి, సుప్రీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మీరిద్దరూ సింగిలా? అన్న ప్రశ్నలకు ఇద్దరూ అవును అనే సమాధానమే ఇచ్చారు. అంతే కాకుండా వారికి బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ సురేఖ కొన్ని క్వాలిటీస్‌ను చెప్పుకొచ్చింది. అప్పుడు సుప్రీత.. మరి తనలో ఈ క్వాలిటీస్ ఏమీ లేవు కదా అనగా.. సురేఖ చెప్పొద్దంటూ వారించింది. దీంతో సురేఖ వాణి.. ప్రస్తుతం ప్రేమలో ఉందంటూ, త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి.

Next Story