Suresh Babu: 'బయోపిక్ అనేది పేరుకు మాత్రమే.. అవేవి నిజాలు కాదు'

Suresh Babu: బయోపిక్ అనేది పేరుకు మాత్రమే.. అవేవి నిజాలు కాదు
Suresh Babu: తన తండ్రి బయోపిక్ చేయాలనే ఆలోచన తనకు అసలు రాలేదని అన్నారు సురేష్ బాబు.

Suresh Babu: ఈమధ్య ప్రతీ భాషా పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. చాలావరకు బయోపిక్స్‌గా తెరకెక్కుతున్న చిత్రాలు హిట్లుగా నిలుస్తుండడంతో మేకర్స్ అంతా వాటిపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అందుకే టాలీవుడ్‌లో ఎంతోమంది ప్రముఖులు బయోపిక్స్ చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. అందులో ఒకరు మూవీ మొగల్ రామానాయుడు. ఇటీవల ఈయన బయోపిక్‌పై సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మూవీ మొగల్‌గా పేరు తెచ్చుకున్న రామానాయుడు.. నిర్మాత గిన్నీస్ రికార్డును కూడా అందుకున్నారు. ఒకప్పుడు రామానాయుడు నిర్మాణంలో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునేవారు స్టార్ హీరోలు. కానీ నిర్మాతగా కాకుండా రామానాయుడు వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అందుకే దగ్గుబాటి ఫ్యామిలీ ఎక్కడ ఎదురైనా.. రామానాయుడు బయోపిక్ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


తన తండ్రి బయోపిక్ చేయాలనే ఆలోచన తనకు అసలు రాలేదని అన్నారు సురేష్ బాబు. మామూలుగా మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కానీ నాన్నగారి బయోపిక్ చేయాలంటే వ్యక్తిగత విషయాలు చూపించాల్సి ఉంటుందని అన్నారు. అలా కాకుండా కేవలం ఆయన సినీ జీవితం మాత్రమే చూపిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని చెప్పారు. ఆయన సినిమా జీవితంలో కూడా చేదు అనుభవాలు ఉంటాయని, అవి చూపించి ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్ద్యేశంతోనే బయోపిక్ ఆలోచన పెట్టుకోలేదని అన్నారు.


అంతే కాకుండా ఈరోజుల్లో విడుదలవుతున్న బయోపిక్స్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు సురేష్ బాబు. బయోపిక్ అనేది పేరుకు మాత్రమే అని, అందులో వాస్తవాలు చూపించడం లేదని అన్నారు సురేశ్ బాబు. కొందరు మార్చి చూపించగా మరికొందరు అదే నిజమని నమ్మించి సినిమాలను చేస్తున్నారని ఆయన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం సురేశ్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story