ఎయిర్ పోర్ట్‌లో వారిని చూసి ఆశ్చర్యపోయా : మీనా

ఎయిర్ పోర్ట్‌లో వారిని చూసి ఆశ్చర్యపోయా : మీనా

మూవీ హీరోయిన్లు ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండేవారు. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా ఇంటి పట్టునే ఉండి కాలక్షేపం చేశారు. ఇటీవలే లాక్డౌన్ నిబంధనలతో షూటింగ్ లకు అనుమతులు లభించాయి. దీంతో నటీనటులకు మళ్లీ హడావిడి మొదలైంది. తాజాగా హీరోయిన్ మీనా పీపీఈ కిట్ ధరించి విమానంలో ప్రయాణం చేశారు. 'దృశ్యం 2' మూవీ షూటింగ్‌ కోసం.. 95 మాస్క్, గ్లోవ్స్, కిట్ ధరించి చెన్నై నుంచి కేరళకు ఆమె ఫ్లైట్‌లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా తన జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

పీపీఈ కిట్ ధరించి ఉన్న ఫొటోల్ని షేర్‌ చేస్తూ.. 'అంతరిక్షంలోకి వెళ్లడానికి రెడీగా ఉన్నాను కదా.. నాకు యుద్ధానికి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. ఏడు నెలల తర్వాత జర్నీ చేశా.. ఎయిర్ పోర్ట్ వెలవెలబోయి.. చూట్టూ అంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి సర్‌ప్రైజ్‌ అయ్యా'.. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. అయితే కొంత మంది పీపీఈ కిట్ ధరించకుండానే వచ్చారని... వారిని చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఈ డ్రెస్‌ అసౌకర్యంగా ఉందని.. చాలా చికాకుగా అనిపించిందిని వివరించారు. చేతికి గ్లౌజులు ధరించడం వల్ల కనీసం ముఖంపై చెమటను శుభ్రం చేసుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. రోజంతా ఇలాంటి సూట్‌లో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు హ్యాట్సాఫ్‌.. మానవత్వంతో మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు మీనా.

ప్రస్తుతం మీనా.. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో 'దృశ్యం 2' మూవీలో నటిస్తున్నారు. 'దృశ్యం'కు సీక్వెల్‌ గా వస్తున్న ఈ మూవీలో మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్నారు. 2013లో రిలీజ్ అయిన 'దృశ్యం' సూపర్ డూపర్ హీట్‌గా నిలిచింది. పలు బాషల్లో హిట్టు అయిన ఈ సినిమా తెలుగు రీమెక్‌లో వెంకటేశ్ హీరోగా నటించారు. వెంకటేశ్‌కి జోడిగా మీనా నటించింది.

Tags

Read MoreRead Less
Next Story