స్వదేశీ టీకా దేశానికే గర్వకారణం: బాలకృష్ణ

స్వదేశీ టీకా దేశానికే గర్వకారణం: బాలకృష్ణ
స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలను కోరారు. స్వదేశీ టీకా విదేశాలకూ ఉపయోగపడటం దేశానికి గర్వకారణమని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలను కోరారు. స్వదేశీ టీకా విదేశాలకూ ఉపయోగపడటం దేశానికి గర్వకారణమని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. కరోనా కాలంలో కూడా వైద్యులు అంకితభావంతో పనిచేసి సేవలందించారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరుగుతోందన్నారు. కరోనాతో పోరాడి మృతిచెందిన వారికి బాలకృష్ణ నివాళులు అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story