Tamannaah Bhatia: చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన తమన్నా..!

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్‌లో హీరోయిన్‌గా నటిస్తోందని మొదట టాక్ వచ్చింది. కానీ అమ్మడికి ఏమైందో, లేక చిత్ర యూనిట్ మైండ్ సెట్ మార్చుకుందో ఏమో కానీ తమన్నాని తీసుకునే నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తమ్ము.. టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. ఈ మధ్య ఓ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమన్నా ఆ ప్రోగ్రామ్ నుంచి కూడా తప్పుకుంది. ఇప్పుడు యాంకర్ అనసూయ తమన్నా ప్లేస్‌ని ఆక్రమించింది. మిల్కీ బ్యూటీ టైమ్ బాలేనట్టుంది ప్రస్తుతం.
ఈ మధ్య తమన్నా హీరోయిన్‌గా నటించిన సీటీమార్, మాస్ట్రో చిత్రాలు కూడా ఆమెను నిరాశపరిచాయి. ఐతే ఎఫ్ 3పై తమన్నా బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తన కెరీర్ మళ్లీ పుంజుకుంటేందేమోనని ఆశపడుతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలంతో పాటు ఓ హిందీ చిత్రం కూడా చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com