ముఖంపై మొటిమల నివారణకు తమన్నా చెప్పిన చిట్కా.. ఉమ్మిని..

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ఉదయం లాలాజలం మొటిమలపై గొప్పగా పనిచేస్తుందని వెల్లడించింది. చర్మ సంరక్షణలో ఉదయం లాలాజలం యొక్క ప్రాముఖ్యతను తమన్నా వెల్లడించింది
చిన్నతనంలో ఎప్పుడూ తన ముఖం మీద మొటిమ కనిపించగానే గిల్లేసేదాన్నని చెప్పుకొచ్చింది. కానీ అలా చేయడం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత ఎక్కువయ్యేవని దాంతో అలా చేయడం ఆపేశానని తెలిపింది. ఆ తరువాత ఓ ప్రముఖ బ్యూటీషియన్ సలహాతో ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకోక ముందే నోటిలోని లాలాజలాన్ని తీసుకుని దాన్ని ప్రతి రోజూ ముఖం మీద ఉన్న మొటిమలపై రాస్తే తగ్గుతాయని చెప్పారు. అప్పటి నుంచి అలానే చేస్తున్నానని దాంతో నాకు మొటిమలు తగ్గిపోయాయని అన్నారు. ఇది ఖర్చులేని పని ఎవరైనా చేయొచ్చు. ఇది ఖచ్చితంగా పని చేస్తుంది. మొటిమలకు చికిత్స చేయడానికి వారి స్వంత లాలాజలం ఉత్తమమైన పరిష్కారం అని ఆమె వెల్లడించింది. మొటిమను ఎండి పోయి రాలిపోయేలాగా చేసే సామర్ధ్యం కూడా ఉమ్మికి ఉందని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com